IPL Auction 2025 Live

Kumari Aunty Hotel Seize Row: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు, షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సర్కారు, యథావిధిగా కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు

తాజాగా కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్‌ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు

Telangana CM Revanth Reddy and Kumari Aunty (photo-X/FB)

సోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి ఫుడ్‌ కోర్టును పోలీసులు బంద్‌ చేయించిన విషయం తెలిసిందే. తాజాగా కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్‌ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంవో ట్వీట్‌ చేసింది.

సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్‌ అయ్యాక ఆ ఫుడ్‌ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్‌తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్‌ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు.తాజాగా ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకుంది. కాగా ఈమెకు సంబంధించిన కొన్ని వీడియోలను ఏపీ అధికార పార్టీ వైసీపీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుందంటూ మండిపడింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)