Telangana: లంచం అడిగిన డాక్టర్‌ను అక్కడికక్కడే సస్పెండ్ చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని ఓ వైద్యుడి లంచావతారంపై కొందరు మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ రావు... వైద్యుడి అవినీతిని గుర్తించి అతడిని అక్కడిక్కడే సస్పెండ్ చేశారు.
హైదరాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని ఓ వైద్యుడి లంచావతారంపై కొందరు మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ రావు... వైద్యుడి అవినీతిని గుర్తించి అతడిని అక్కడిక్కడే సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఆ డాక్టర్ లంచం అడుగుతుండడంతో మంత్రి పైవిధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, ఇతర సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని, లంచాలు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అంతా కలియదిరిగిన హరీశ్ రావు రోగులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
గైనకాలజీ వార్డును కూడా మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గైనకాలజీ వార్డుల్లో నిత్యం స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకు అదనంగా మరో రెండు అల్ట్రా సౌండ్ యంత్రాలు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. 60 శాతానికి పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని హరీశ్‌రావు సూచించారు.