Mohammed Ali Slaps Cop: వీడియో ఇదిగో, గన్‌మెన్ చెంప చెల్లుమనిపించిన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళితే.. మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్‌మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు.
ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Here's Video