Covid in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,006 పాజిటివ్ కేసులు నమోదు, జీహెచ్ఎంసీ పరిధిలో 141 కొత్త కేసులు, 17,765 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 87,854 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ (141) మినహా, తెలంగాణ జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Coronavirus in India (Photo Credits: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 87,854 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ (141) మినహా, తెలంగాణ జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రంలో 1,798 మందికి కరోనా నయం కాగా, 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 3,567 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటిదాకా 6,13,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,91,870 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,765 మందికి చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.52 శాతంగా ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement