Corona in TS: తెలంగాణలో కొత్తగా 135 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,842 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 135 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు గుర్తించారు.

Coronavirus test (Photo-ANI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,842 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 135 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు గుర్తించారు. వనపర్తి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 168 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,377 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,950 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,947కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement