Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 205 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79 కేసులు

తెలంగాణలో బుధవారం 38,085 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 205 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,77,546కి చేరిందని తెలిపారు.

Coronavirus-in-India ( photo-PTI)

తెలంగాణలో బుధవారం 38,085 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 205 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,77,546కి చేరిందని తెలిపారు. గత 24 గంటల్లో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,002కు పెరిగిందన్నారు. తాజాగా 185 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 6,69, 673కి చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో, ఆస్పత్రుల్లో 3,871 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఒకరోజులో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79 రికార్డయ్యాయన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement