Corona in TS: తెలంగాణలో మెల్లిగా పెరుగుతున్న కేసులు, గత 24 గంటల్లో 658 మందికి కరోనా, హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదు

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 30,552 కరోనా పరీక్షలు నిర్వహించగా, 658 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41, ఖమ్మం జిల్లాలో 30, పెద్దపల్లి జిల్లాలో 25, నల్గొండ జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus Outbreak in China (Photo Credits: PTI)

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 30,552 కరోనా పరీక్షలు నిర్వహించగా, 658 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41, ఖమ్మం జిల్లాలో 30, పెద్దపల్లి జిల్లాలో 25, నల్గొండ జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 628 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,10,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,02,354 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,511 మంది చికిత్స పొందుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement