Corona in TS: తెలంగాణలో కొత్తగా 705 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 355 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గడచిన 24 గంటల్లో 32,834 శాంపిల్స్ పరీక్షించగా, 705 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 355 కొత్త కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 48, కరీంనగర్ జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు గుర్తించారు.

Coronavirus

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గడచిన 24 గంటల్లో 32,834 శాంపిల్స్ పరీక్షించగా, 705 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 355 కొత్త కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 48, కరీంనగర్ జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు గుర్తించారు. అదే సమయంలో 531 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,19,846 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,10,192 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,543 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement