Hyderabad: కూకట్ పల్లిలో భవనం కూల్చివేత, మద్యం మత్తులో ఇంట్లోనే పడుకున్న వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుని మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు

Representative image. (Photo Credits: Unsplash)

కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు.దానికి ముందు రోజే ఆ ఇంటిలో అద్దెకు ఉన్న అందరినీ ఖాళీ చేయించారు. ఉదయం పాక్షికంగా పనులు చేపట్టగా.. భోజన విరామం అనంతరం పూర్తిగా కూల్చివేశారు.

అయితే బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల నిద్రపోయాడు అద్దెకున్న వ్యక్తి. ఆ విషయం తెలియకుండా పూర్తిగా కూల్చివేయడంతో స్వామి రెడ్డి శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుల్లుగా తాగి హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన హల్ చల్ చేసిన యువకుడు, ముప్ప తిప్పలు పడి అతన్ని కిందకు దించిన పోలీసులు, వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement