Talasani Srinivas Yadav Dance Video: తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ వీడియో ఇదిగో, అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపులో చిందేసిన తెలంగాణ మంత్రి
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నృత్యం చేసి భక్తుల్లో జోష్ నింపారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నృత్యం చేసి భక్తుల్లో జోష్ నింపారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మొండా మార్కెట్ నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఫలహారం ఊరేగింపు సందడిగా సాగింది. పోతరాజుల నృత్యాలు, కళాకారుల వేషధారణలు, డప్పు చప్పుళ్లతో పరిసరాలు మార్మోగాయి. సికింద్రాబాద్ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. అక్కడున్న వారితో తలసాని చిందులేసిన వీడియో ఇదిగో..
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)