Corona in TS: తెలంగాణలో కొత్తగా 196 మందికి కోవిడ్, గత 24 గంటల్లో ఒకరు మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 59 కొత్త కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటలలో 44,310 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 59 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 15, నల్గొండ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,266 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,143 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,190 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,933కి పెరిగింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..
Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
New HMPV Cases in Gujarat: గుజరాత్లో మరో బాలుడికి HMPV వైరస్, మొత్తం 8 కి చేరిన కేసుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement