Telangana Govt Transfers IAS,IPS Officers: హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి

తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి (Hyderabad CP Kotha kota Srinivasreddy) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Revanth Reddy(Photo0X)

రాచకొండ సీపీగా సుధీర్ బాబు (Rachakonda CP Sudhirbabu), సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి (Syberabad CP Avinash Mahanti) నియమితులయ్యారు. అలాగే హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కొత్త సీపీలు వీరే..

రాచకొండ సీపీ.. సుధీర్‌బాబు

హైదరాబాద్‌ సీపీ.. కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి

సైబరాబాద్‌ సీపీ.. అవినాశ్‌ మహంతి

తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌.. సందీప్‌ శాండిల్యా

Telangana Govt Transfers IAS,IPS Officers

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement