Stray Dog Attack: నిజామాబాద్‌లో బాలుడి మీద దాడి చేసిన వీధి కుక్క, వీడియో ఇదిగో..
అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8వ డివిజన్‌లో ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కిరాణా షాపుకు వెళ్లి ఏదో తినే పదార్థాన్ని కొనుగోలు చేసిన బాలుడు దాన్ని చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు.
నిజామాబాద్ జిల్లాలో ఓ వీధి కుక్క బాలుడిపై దాడికి యత్నించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8వ డివిజన్‌లో ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కిరాణా షాపుకు వెళ్లి ఏదో తినే పదార్థాన్ని కొనుగోలు చేసిన బాలుడు దాన్ని చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు. అంతలో అతడికి ఎదురుగా వచ్చిన ఓ వీధి కుక్క బాలుడిపై దాడికి తెగబడింది. చిన్నారి చేతిలో ఉన్న తినే పదార్థాన్ని లాక్కునేందుకు ప్రయత్నించింది. బాలుడు గట్టిగా అరవటంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లో నుంచి వ్యక్తి బయటకు వచ్చాడు. దీంతో వీధి కుక్క బాలుడి చేతిలో ఉన్న పదార్థాన్ని లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీసింది. అయితే చిన్నారికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరిపీల్చున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)