Tractor Driver Fine: సీటు బెల్టు పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ. 100 జరిమానా, దీనిపై పోలీస్ అధికారులు ఏమంటున్నారంటే..
మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు.
ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్ పోలీసులు జరిమానా విధించిన ఘటన పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది.ఓ ట్రాకర్ట్ నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా స్టీరింగ్ ఉన్న ప్రతీ వాహనం డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనల మేరకు సీట్ బెల్టు పెట్టుకోవాల్సిందేనని చెప్పడం గమనార్హం.అయితే నిబంధన ఉల్లంఘన కింద ర్యాష్ డ్రైవింగ్‌కు బదులు సీటుబెల్టు అని కంప్యూటర్‌లో రైటర్ తప్పుగా నమోదు చేశారని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్, గర్భిణీ మహిళపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన డాక్టర్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)