నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మైనార్టీ గర్భిణీ మహిళకు అనుకోని సంఘటన ఎదురైంది. ఒక ముస్లిం మైనార్టీ మహిళ డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకుంటున్న సమయంలో డాక్టర్ తనని ఎన్నో కాన్పు అని అడగగా సదరు మహిళ ఐదో కాన్పు అని తెలిపింది. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్ అని ఇష్టం ఉన్న రీతిలో డాక్టర్​ అసభ్య పదజాలంతో బూతులు తిట్టిందని ఆమె తెలిపారు.ఈ సంఘటన తో ఆ మహిళ ఆసుపత్రిలో కన్నీరు మున్నీరు అయ్యింది. ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వస్తే ఇలాంటి అవమానకరంగా మాట్లాడటం ఏంటి ఆ దంపతులు వాపోయారు.ఈ విషయంపై మహిళ భర్త సదరు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నత అధికారులు ఆ డాక్టరు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. దవాఖానలో అడ్మిట్ చేసుకునేందుకు వైద్యుల నిరాక‌ర‌ణ‌.. ఆస్ప‌త్రి గేటు వ‌ద్దే గ‌ర్భిణి ప్ర‌స‌వం.. రాజస్థాన్ లో ఘటన

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)