Viral Video: ప్రేమించిన యువతిపై రోడ్డేపైనే పెట్రోల్ పోసిన యువకుడు.. స్థానికుల దేహశుద్ది, సూర్యాపేటలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో

ప్రేమించిన యువతిపై రోడ్డు మీదనే పెట్రోల్ పోసి బెదిరించాడు ఓ యువకుడు(viral video). తెలంగాణలోని సూర్యాపేట(Suryapet) జిల్లా - హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది

Viral VideoYoung Man Threatens His Lover by Pouring Petrol on Her in the Middle of the Road(video grab)

ప్రేమించిన యువతిపై రోడ్డు మీదనే పెట్రోల్ పోసి బెదిరించాడు ఓ యువకుడు(viral video). తెలంగాణలోని సూర్యాపేట(Suryapet) జిల్లా - హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీ వద్ద ప్రధాన రహదారి పక్కనే నిలబడి ఉన్న ఓ యువతిపై పెట్రోల్ పోశాడు ఓ యువకుడు(Pouring Petrol).

ముందుగా తాను పెట్రోల్ పోసుకొని.. తర్వాత యువతిపై పెట్రోల్ పోసి బెదిరింపులకు పాల్పడ్డాడు యువకుడు. ఇది గమనించి యువకుడికి దేహశుద్ధి చేశారు స్థానికులు. ఇద్దరి మధ్య కొంత కాలంగా లవ్ ఎఫైర్ నడుస్తున్నదని తెలిపారు స్థానికులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 వీడియో ఇదిగో, మహబూబాబాద్‌లో రాత్రిపూట రాళ్ల వర్షం, తెల్లారి ఇళ్ల ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆందోళనలో ప్రజలు 

ఇక మరో ఘటనలో మహబూబాబాద్‌లోని వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.కొన్నిరోజులుగా చీకటి పడితేచాలు ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. అయితే ఆ రాళ్లు ఎలా పడుతున్నాయో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. అంతేకాకుండా తెల్లవారుజామున ఏ ఇంటి ముందు చూసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంటున్నాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Young Man Threatens His Lover by Pouring Petrol on Her in the Middle of the Road

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now