Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిర్లా మందిర్ దగ్గర బిచ్చం ఎత్తుకుని బతికే వాళ్ళు, రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కేటీఆర్ సన్నాసి.. తెలంగాణకి.. కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందని అంటున్నాడు.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకు బతికే వాళ్ళు అంటూ ఆయన మండిపడ్డారు.

Revanth Reddy escapes house arrest to participate in protest for reducing electricity price (Photo-Twitter)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. నేతలు పరస్పర దూషణలకు దిగడంతో పాటుగా హామీలతో దూసుకుపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బస్సు యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిర్లా మందిర్ దగ్గర, నాంపల్లి దర్గా దగ్గర మీరు బిచ్చం ఎత్తుకుని బతికే వాళ్ళుని రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సన్నాసి.. తెలంగాణకి.. కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందని అంటున్నాడు.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకు బతికే వాళ్ళు అంటూ ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేసుకున్నది కేసీఆర్ కుటుంబం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.రాహుల్ గాంధీని నువ్వేవరు అని అడిగేంత బలుపు అవసరమా.. రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్ అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

TPCC Chief Revanth Reddy

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)