Elon Musk: ప్రపంచ కుబేరుడుకి ఉండటానికి సొంత ఇల్లు లేదట, రోజూ స్నేహితుల ఇండ్లల్లోనే పడుకొంటాడట, విహారానికి వెళ్లడానికి తన వద్ద షిప్ కూడా లేదంటున్న ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన విషయాలు చెప్పారు. తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇండ్లల్లోనే పడుకొంటానని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలా న్ మస్క్ తెలిపారు. టెస్లాలో పనిచేసే ఇంజినీర్ల బృందంలో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని, రాత్రిళ్లు వాళ్ల ఇండ్లల్లోని ఖాళీ గదుల్లోనే నిద్రిస్తానని పేర్కొన్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన విషయాలు చెప్పారు. తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇండ్లల్లోనే పడుకొంటానని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలా న్ మస్క్ తెలిపారు. టెస్లాలో పనిచేసే ఇంజినీర్ల బృందంలో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని, రాత్రిళ్లు వాళ్ల ఇండ్లల్లోని ఖాళీ గదుల్లోనే నిద్రిస్తానని పేర్కొన్నారు. విహారానికి వెళ్లడానికి తన వద్ద షిప్ కూడా లేదని తెలిపారు. అయితే తనకు సొంత విమానం ఉన్నదని, ప్రయాణాల్లో సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే దాన్ని కొన్నట్టు పేర్కొన్నారు. ఫోర్బ్స్ తాజా జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్ నిలిచారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)