Extremists Fire in Congo: కత్తులు, తుఫాకులతో అమాయకులపై విరుచుకుపడిన ఉగ్రమూకలు, కాంగోలో 36 మంది పౌరులు మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

కాంగోలో ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌(ఏడీఎఫ్‌) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్‌ కివు ప్రావిన్స్‌ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి.

Representational (Google Credits)

కాంగోలో ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌(ఏడీఎఫ్‌) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్‌ కివు ప్రావిన్స్‌ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి.ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధాలున్న తిరుగుబాటు మిలీషియా అయిన అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉత్తర కివు ప్రావిన్స్‌లోని ముకొండి గ్రామంలో పౌరులను హతమార్చిందని బెని పట్టణంలోని కాంగో ఆర్మీ ప్రతినిధి కెప్టెన్ ఆంథోనీ మ్వాలుషాయి తెలిపారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారని, గల్లంతైన వారి కోసం దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement