Balochistan Blast: బలూచిస్థాన్‌లో రెండు చోట్ల భారీ పేలుళ్లు, 25 మంది మృతి..40 మందికి తీవ్ర గాయాలు, రేపు పాకిస్తాన్ జాతీయ ఎన్నికలు
పాకిస్తాన్ ఎన్నికల వేళ భారీ పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు రెండు చోట్ల పేలుడు సంఘటనలు జరిగాయి. నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాల సమీపంలో జరిగిన ఈ పేలుళ్లలో 25 మంది మరణించారు.
పాకిస్తాన్ ఎన్నికల వేళ భారీ పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు రెండు చోట్ల పేలుడు సంఘటనలు జరిగాయి. నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాల సమీపంలో జరిగిన ఈ పేలుళ్లలో 25 మంది మరణించారు. పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం వద్ద మొదటి పేలుడు జరిగింది. ఈ సంఘటనలో 12 మంది మృరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖిల్లా సైఫుల్లా పట్టణంలో గల జమియాత్ ఉలేమా ఇస్లాం (జేయూఐ) కార్యాలయం సమీపంలో రెండవ దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది మరణించారు. ఉగ్రవాదులు, బబూచిస్థాన్ వేర్పాటు వాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్ల నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.పాకిస్థాన్‌లో గురువారం జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి.
Here's Video