Darlyn Morais Dies: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం, సాలీడు కాటుతో ప్రముఖ బ్రెజిల్ సింగర్ డార్లిన్ మోరైస్ మృతి
హాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బ్రెజిల్ సింగర్ డార్లిన్ మోరైస్ (Singer Darlyn Morais) సాలీడు కాటు వేయడంతో మృతి చెందారు. మోరైస్ (28) ముఖంపై సాలీడు కరవడంతో గాయమై శరీరాన్ని నిస్సత్తువ ఆవహించింది.
హాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బ్రెజిల్ సింగర్ డార్లిన్ మోరైస్ (Singer Darlyn Morais) సాలీడు కాటు వేయడంతో మృతి చెందారు. మోరైస్ (28) ముఖంపై సాలీడు కరవడంతో గాయమై శరీరాన్ని నిస్సత్తువ ఆవహించింది. సాలీడు కాటుతో అలర్జీకి గురయ్యాడని భావించిన తాము ఆస్పత్రికి తీసుకువెళ్లామని గాయకుడి భార్య జులినీ లిసోబ పేర్కొంది. చికిత్స అనంతరం ఈనెల 3న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని తెలిపింది.
అయితే మోరైస్ ఆరోగ్య పరిస్ధితి దిగజారడంతో ఆదివారం పల్మాస్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మోరైస్ సోమవారం తుదిశ్వాస విడిచాడని లిసోబ తెలిపింది. మోరైస్ సవతి కూతురు (18)కు కూడా పాదంపై సాలీడు కరిచిందని ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని పేర్కొంది.
Here's News