China in Covid: చైనాను వణికిస్తున్న కరోనా మరణాలు, తాజాగా ముగ్గురు మృతితో 5229కు చేరుకున్న మరణాల సంఖ్య, బీజింగ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు

ఆర్నేళ్ల త‌ర్వాత తొలిసారి చైనాలో మ‌ళ్లీ కరోనాలు మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. శ‌నివారం నుంచి బీజింగ్‌లో కోవిడ్ వ‌ల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్న‌ది. చైనాలో ప్ర‌స్తుతం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న విష‌యం తెలిసిందే.

coronavirus (Photo-PTI)

ఆర్నేళ్ల త‌ర్వాత తొలిసారి చైనాలో మ‌ళ్లీ కరోనాలు మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. శ‌నివారం నుంచి బీజింగ్‌లో కోవిడ్ వ‌ల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్న‌ది. చైనాలో ప్ర‌స్తుతం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోవిడ్ మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం ఆందోళ‌కరంగా మారింది.

దేశ రాజ‌ధాని బీజింగ్‌లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్న‌ట్లు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇక జీరో కోవిడ్ పాల‌సీని వ్య‌తిరేకిస్తూ చైనాలో నిర‌స‌న‌లు తీవ్రంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇంకా ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం లాక్‌డౌన్‌లో ఉన్నారు. కొంద‌రు పౌరుల్ని బ‌ల‌వంతంగా క్వారెంటైన్ చేశారు.బీజింగ్‌లో 2.1 కోట్ల జ‌నాభా ఉన్న విష‌యం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement