Ngadag Pel gi Khorlo: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం, న్గడగ్ పేల్ గి ఖోర్లో అవార్డును అందుకోనున్న భారత ప్రధాని, పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి విదేశీయుడు మోదీనే

భారత ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన 'న్గడగ్ పేల్ గి ఖోర్లో'ను (Ngadag Pel gi Khorlo) మోదీకి ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన 'న్గడగ్ పేల్ గి ఖోర్లో'ను (Ngadag Pel gi Khorlo) మోదీకి ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి (PM Narendra Modi) ఇవ్వాలని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్ చుక్ సూచించారని తెలిపింది. భూటాన్ కు అన్ని విధాలుగా, అన్ని సమయాల్లో ప్రధాని మోదీ అందిస్తున్న సాయాన్ని తమ రాజు ప్రధానంగా ప్రస్తావించారని పేర్కొంది. భూటాన్ కు కొన్నేళ్లుగా మోదీ ఎంతో సాయం చేశారని... ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మోదీ అందించిన స్నేహహస్తం వెలకట్టలేనిదని కొనియాడింది.

తమ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి (PM Modi Honoured With Bhutan's Highest Civilian Award) మోదీ అత్యంత అర్హులని చెప్పింది. తమ దేశ ప్రజలందరి తరపున మోదీకి శుభాకాంక్షలు చెపుతున్నామని తెలిపింది. కాగా 2008లో ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని భూటాన్ నెలకొల్పింది. ఇంత వరకు ఏ విదేశీయుడికి ఈ పురస్కారాన్ని భూటాన్ ఇవ్వలేదు. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి విదేశీయుడు మోదీ కావడం గమనార్హం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement