Theft Caught on Camera: విమానాశ్రయంలో చెకింగ్ సమయంలో మీ బ్యాగుల్లో డబ్బులు పెడుతున్నారా, అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..
బ్యాగుల్లో ఉన్న డబ్బులు చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అమెరికాలోని మియామీ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బ్యాగుల్లో ఉన్న డబ్బులు చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల బ్యాగుల నుంచి డబ్బులు దొంగిలించిన ఇద్దరు సిబ్బందిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులతోపాటు మరో మహిళా సిబ్బంది ఒక ముఠాగా ఏర్పడి ప్రయాణికుల బ్యాగుల్లోని డబ్బులు, ఇతర వస్తువులు చోరీ చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ప్రతీ రోజు సుమారు 600 నుంచి వెయ్యి అమెరికా డాలర్లు దోచుకున్నట్లు నిందితులు అంగీకరించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)