ICC T20 World Cup 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో విజయంతో ప్రస్థానం ప్రారంభించిన ఐర్లాండ్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపు
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ విజయంతో ప్రస్థానం ప్రారంభించింది. ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. 107 పరుగుల విజయలక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ఛేదించింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ విజయంతో ప్రస్థానం ప్రారంభించింది. ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. 107 పరుగుల విజయలక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ఛేదించింది. గారెత్ డెలానీ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.
నెదర్లాండ్స్ బౌలర్లలో క్లాసెన్, గ్లోవర్, కెప్టెన్ సీలార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు నెదర్లాండ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఐర్లాండ్ బౌలర్లు కర్టిస్ కాంఫర్, మార్క్ అడైర్ ధాటికి 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యం కావడంతో ఐర్లాండ్ ఆటగాళ్లు పెద్దగా శ్రమ పడకుండానే ఛేదించారు. ఈ క్రమంలో కేవలం 3 వికెట్లు కోల్పోయారు.
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Man Kisses Youth Forcibly in Train: వీడియో ఇదిగో, రైలులో నిద్రపోతున్న యువకుడిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఓ వ్యక్తి, పట్టుకుని చితకబాదిన బాధితుడు
Advertisement
Advertisement
Advertisement