India vs Zimbabwe T20 Series 2026: జింబాబ్వే vs భారత్ T20 షెడ్యూల్ 2026: మ్యాచ్ తేదీలు, సమయాలు, వేదికలు, జట్లు పూర్తి వివరాలు
జూలై 23 నుండి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు సిద్ధమైంది. ఈ పర్యటన కోసం సెలెక్టర్లు పలువురు నూతన ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ యువ భారత్‌ను బరిలోకి దించుతున్నారు.
India vs Zimbabwe T20 Series 2026: జూలై 23 నుండి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు సిద్ధమైంది. ఈ పర్యటన కోసం సెలెక్టర్లు పలువురు నూతన ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ యువ భారత్‌ను బరిలోకి దించుతున్నారు.
జట్టులో కీలక మార్పుల విషయానికి వస్తే.. కండరాల గాయం కారణంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు. మరోవైపు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల జట్టులో ఉన్న సంజు శాంసన్‌ను ఈ పర్యటనకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. శాంసన్‌తో పాటు అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లకు కూడా జట్టులో స్థానం లభించలేదు. ఇక రీ-ఎంట్రీ ఇచ్చిన రింకు సింగ్, మయాంక్ యాదవ్‌లతో పాటు ప్రభసిమ్రన్ సింగ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ మరియు హర్ష్ దుబే రూపంలో నలుగురు నూతన ముఖాలు తొలిసారి టీ20ఐ జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకు సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రవి బిష్ణోయ్ ఉన్నారు.
జింబాబ్వే జట్టుకు సికందర్ రజా నాయకత్వం వహిస్తుండగా.. బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, బెన్ కర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ న్గారవా, డియోన్ మైయర్స్, న్యూమ్యాన్ న్యామహురి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం జీ యునైట్8 స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉండగా.. డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా వీక్షించవచ్చు. చివరిగా ఈ రెండు జట్లు చెన్నై వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ సూపర్ ఎయిత్ మ్యాచ్‌లో తలపడ్డాయి, ఆ పోరులో భారత్ 256/4 పరుగుల భారీ స్కోరు సాధించి 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత పర్యటనలోని మూడు టీ20ఐ మ్యాచ్‌లు కూడా హరారేలోని 'హరారే స్పోర్ట్స్ క్లబ్' వేదికగానే జరగనున్నాయి. మొదటి టీ20ఐ మ్యాచ్ జూలై 23 గురువారం నాడు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండో టీ20ఐ మ్యాచ్ జూలై 25 శనివారం నాడు సాయంత్రం 4:30 గంటలకు జరగనుంది. చివరిదైన మూడో టీ20ఐ మ్యాచ్ జూలై 26 ఆదివారం నాడు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమై ఈ సిరీస్ ముగుస్తుంది.