Hardik Pandya: ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ ప్యాండ్యా, వనిందు హసరంగను వెనక్కునెట్టేసిన టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ ప్యాండ్యా ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. శ్రీలంకు చెందిన వనిందు హసరంగను వెనక్కునెట్టి నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు

Hardik Pandya (Photo-ICC)

Hardik Pandya Becomes World No. 1 T20I All-Rounder: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ ప్యాండ్యా ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. శ్రీలంకు చెందిన వనిందు హసరంగను వెనక్కునెట్టి నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు.టీ20 వరల్డ్‌ కప్‌లో 150 కంటే ఎక్కువ స్ట్రయిక్‌ రేట్‌తో 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్ల తీశాడు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌ టెన్‌లో హసరంగ, మార్కస్ స్టోయినిస్, సికందర్ రజా, షకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ, దీపేంద్ర సింగ్‌, లియామ్ లివింగ్‌స్టోన్, ఐడెన్ మార్క్‌రమ్, మోయిన్‌ అలీ ఉన్నారు. వీడియో ఇదిగో, బార్బ‌డోస్‌ నుండి ఎట్టకేలకు బయలుదేరిన టీమిండియా, ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి..

టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. అన్రిచ్‌ నొర్ట్‌జే రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక బౌలర్‌ హసరంగ రెండో స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్‌ ఆల్‌ రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ మూడోస్థానంలో ఉన్నాడు. టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 12 స్థానాలు మెరుగుపరుచుకొని 12వ స్థానానికి చేరుకున్నాడు. టాప్‌-10 బౌలర్లలో అక్షర్‌పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ చోటు సంపాదించారు. టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అర్షదీప్‌ సింగ్‌ 13వ స్థానానికి చేరాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement