IPL 2023: నీకు బుర్ర ఉందా..ఏం చేస్తున్నావసలు, లలిత్‌ యాదవ్‌పై మండిపడిన డేవిడ్ వార్నర్, ముంబైపై ఓటమితో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ

ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో లలిత్‌ యాదవ్‌పై ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కోపంతో ఊగిపోయాడు.

David Warner and Lalit Yadav (Photo-IPL)

ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో లలిత్‌ యాదవ్‌పై ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కోపంతో ఊగిపోయాడు.

ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ సంచలన విజయం..రెండు ఓటముల తర్వాత బోణీ కొట్టిన రోహిత్ సేన

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన గ్రీన్‌ బౌలింగ్‌లో వార్నర్‌ మిడ్‌ఆఫ్‌ దిశగా షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అది మిస్‌టైమ్‌ కావడంతో మిడ్‌ఆఫ్‌లో ఉన్న చావ్లా చేతికి వెళ్లింది. చావ్లా ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ క్రమంలో వార్నర్‌ సింగిల్‌ కోసం​ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న లలిత్‌ యాదవ్‌ వార్నర్‌ను గమనించకుండా చావ్లా వైపు చూస్తూ ఉండిపోయాడు.

Here's Video

దీంతో వార్నర్‌ అతడిపై గట్టిగా అరుస్తూ రన్‌కు వెళ్లుంటూ సైగలు చేశాడు. అప్పుడు లలిత్‌ వికెట్‌ కీపర్‌వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఒక వేళ చావ్లా బంతిని వెంటనే వికెట్‌ కీపర్‌కు త్రో చేసి ఉంటే వార్నర్‌ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో వార్నర్‌ 51 పరుగులు సాధించాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్ ఏ‍ప్రిల్‌ 15న ఆర్సీబీతో తలపడనుంది.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement