IPL 2023: రెండోసారి చతికిలపడిన బెంగుళూరు, ఓటమి తట్టుకోలేక స్టేడియంలోనే ఏడ్చేసిన అభిమానులు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

ఐపీఎల్‌లో బెంగుళూరుతో జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో .. ల‌క్నో(Lucknow Super Giants) జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది.అయితే సీజన్ మారినా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) తీరు మాత్రం మారడం లేదు. మ్యాచ్ చివరి క్షణాల్లో ఒత్తిడిని జయించలేక చతికిల పడడం ఆర్సీబీ ఆటగాళ్లకు అలవాటుగా మారిపోయింది.

Girl crying after RCB’s loss (Photo-IPL)

ఐపీఎల్‌లో బెంగుళూరుతో జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో .. ల‌క్నో(Lucknow Super Giants) జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది.అయితే సీజన్ మారినా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) తీరు మాత్రం మారడం లేదు. మ్యాచ్ చివరి క్షణాల్లో ఒత్తిడిని జయించలేక చతికిల పడడం ఆర్సీబీ ఆటగాళ్లకు అలవాటుగా మారిపోయింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం

సోమవారం జరిగిన మ్యాచ్‌లో (RCBvsLSG) కూడా చివరి వరకు బెంగళూరుదే పైచేయిగా నిలిచింది. చివర్లో గేమ్ ప్లాన్‌ను సరిగ్గా అమలు చేయలేక చేతులెత్తేసింది. చివరి బంతికి అవేష్ ఖాన్ విన్నింగ్ రన్ తీయడంతో చిన్నస్వామి స్టేడియంలోని అభిమానులు మౌనంగా ఉండిపోయారు.గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోగానే కొందరు అభిమానులు (RCB Fans) కన్నీళ్లు పెట్టుకున్నారు.

Here's Video

ఈ మ్యాచ్ చూసేందుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ (Anushka Sharma) కూడా చిన్నస్వామి స్టేడియంకు వెళ్లింది. బెంగళూరు బ్యాటింగ్ సమయంలోనూ, ఆరంభంలో లక్నో వికెట్లు కోల్పోయినపుడు ఆమె చాలా ఉత్సాహంగా కనిపించింది. అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆమె కూడా సైలెంట్ అయిపోయింది.ఈ సీజన్‌లో బెంగళూరు జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో బెంగళూరు టీమ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement