IPL 2023: వీడియో ఇదిగో, తొలి ఐపీఎల్‌ వికెట్‌ సాధించిన సచిన్ కొడుకు అర్జున్, కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయని ముంబై ఇండియన్స్ యువపేసర్

ముంబై ఇండియన్స్‌ యువ పేసర్‌, సచిన్‌ తనయుడు అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్‌ వికెట్‌ను సాధించాడు.ఐపీఎల్‌-2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ను ఔట్‌ చేసిన అర్జున్.. తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2.5 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

Arjun (File Photo: Cricinfo)

మాకు ఆ ఇద్దరు ఫినిషర్లు ఉంటే దుమ్ము రేపే వాళ్లం, కీలక వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్‌ కోచ్, తెవాటియా, మిల్లర్‌ లాంటి ప్లేయర్లు ఉండాలని సూచన

కాగా ఆఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బంతిని అర్జున్‌ చేతికి అందించాడు. జానియర్‌ టెండూల్కర్ రోహిత్‌ నమ్మకాన్ని వమ్ము చేయలేదు.అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Here's Video

ఇదే ఓవర్‌లో ఐదో బంతికి భువనేశ్వర్‌ కుమార్‌ను ఔట్‌ చేయడంతో.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.ముంబైకు డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు దొరికాడని పలువురు మాజీలు కొనియాడుతున్నారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement