T20 World Cup 2021: పాకిస్తాన్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం, కివీస్ బ్యాట్స్‌మన్లను ముప్పతిప్పలు పెట్టిన హారిస్ రవూఫ్
దాయాది దేశం పాకిస్తాన్ టి20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. షార్జాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) బాబర్ ఆజమ్ బృందం ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఇక సెమిస్ కు చాలా దగ్గరగా వెళ్లింది.
దాయాది దేశం పాకిస్తాన్ టి20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. షార్జాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) బాబర్ ఆజమ్ బృందం ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఇక సెమిస్ కు చాలా దగ్గరగా వెళ్లింది. ఎందుకంటే గ్రూప్–2లో పాక్‌కు ఎదురయ్యే జట్లు క్రికెట్ కూనలు (అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్) కావడంతో సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైంది.
న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో (PAK vs NZ Stat Highlights T20 World Cup 2021) టాస్ నెగ్గిన పాకిస్తాన్ మళ్లీ బౌలింగ్ ఎంచుకుంది. షరామాములుగా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హారిస్ రవూఫ్ (4/22) కివీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు సాగనివ్వలేదు.దీంతో మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
డరైల్ మిషెల్ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కాన్వే (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఆడిన వారిలో మెరుగనిపించారు. కెప్టెన్ విలియమ్సన్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) 20 పరుగుల మార్క్‌ను చేరుకోగా మిగతా వారంతా పాక్ బౌలింగ్‌కు తలవంచారు. షాహిన్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, హఫీజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి గెలిచింది.
ఇక టాపార్డర్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11), హఫీజ్ (11) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇన్నింగ్స్‌ను చక్కబెడుతున్న రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా నిష్క్రమించడంతో పాక్ ఒకదశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అనుభవజ్ఞుడైన షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆసిఫ్ అలీ (12 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) జట్టును గెలిపించారు. ఆసిఫ్ అలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో పాక్ మరో 8 బంతులుండగానే గెలిచింది. ఇష్ సోధి 2, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్ తలా ఒక వికెట్ తీశారు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (బి) రవూఫ్ 17; మిషెల్ (సి) ఫఖర్ (బి) వసీమ్ 27; విలియమ్సన్ (రనౌట్) 25; నీషమ్ (సి) ఫఖర్ (బి) హఫీజ్ 1; కాన్వే (సి) బాబర్ (బి) రవూఫ్ 27; ఫిలిప్స్ (సి) హసన్ అలీ (బి) రవూఫ్ 13; సీఫర్ట్ (సి) హఫీజ్ (బి) షాహిన్ అఫ్రిది 8; సాన్‌ట్నర్ (బి) రవూఫ్ 6; సోధి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 134.
వికెట్ల పతనం: 1–36, 2–54, 3–56, 4–90, 5–116, 6–116, 7–125, 8–134. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–1–21–1, వసీమ్ 4–0–24–1, హసన్ అలీ 3–0–26–0, హారిస్ రవూఫ్ 4–0–22–4, షాదాబ్ 3–0–19–0, హఫీజ్ 2–0–16–1.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 33; బాబర్ ఆజమ్ (బి) సౌతీ 9; ఫఖర్ జమాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 11; హఫీజ్ (సి) కాన్వే (బి) సాన్‌ట్నర్ 11; షోయబ్ మాలిక్ (నాటౌట్) 26; వసీమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి)బౌల్ట్ 11; ఆసిఫ్ అలీ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 7;
మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 135.
వికెట్ల పతనం: 1–28, 2–47, 3–63, 4–69, 5–87. బౌలింగ్: సాన్‌ట్నర్ 4–0–33–1, సౌతీ 4–0–25–1, బౌల్ట్ 3.4–0–29–1, నీషమ్ 3–0–18–0, సోధి 4–0–28–2.
(The above story first appeared on LatestLY on Oct 27, 2021 10:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

