Rohit Sharma ODI Captain: కోహ్లీకి బీసీసీఐ బిగ్‌ షాక్, వన్డే, టీ-20 పర్మినెంట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, టెస్టు కెప్టెన్సీకే పరిమితం కానున్న కోహ్లీ

విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చింది బీసీసీఐ. టీమిండియా వన్డే కెప్టెన్‌ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయింది. దీంతో విరాట్ కోహ్లీ కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌ గా పరిమితం కానున్నారు. ఇక నుంచి జరిగే అన్ని సిరీసుల్లోనూ వన్డే, టీ20 జట్లకు రోహితే సారధ్యం వహిస్తాడని బీసీసీఐ ప్రకటించింది.

New Delhi December 08: విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చింది బీసీసీఐ. టీమిండియా వన్డే కెప్టెన్‌ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయింది. దీంతో విరాట్ కోహ్లీ కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌ గా పరిమితం కానున్నారు. ఇక నుంచి జరిగే అన్ని సిరీసుల్లోనూ వన్డే, టీ20 జట్లకు రోహితే సారధ్యం వహిస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ఈ ప్రకటనతో సౌతాఫ్రికా సిరీస్‌లో జరిగే మూడు వన్డే మ్యాచుల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టు సారధ్యానికి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారతజట్టుకు రోహిత్ శర్మ సారధ్యం వహించాడు. ఇప్పుడు వన్డే జట్టుకు కూడా రోహిత్ శర్మనే సారధిగా నియమిస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో కోహ్లీ అభిమానులు షాక్ కు గురయ్యారు.

India vs South Africa New Schedule: టీమిండియా, దక్షిణాఫ్రికా టూర్ షెడ్యూల్ విడుదల, మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ కోసం పోరు...

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement