T20 World Cup 2022: టీమిండియాకు చద్దన్నం వడ్డించిన ఐసీసీ, ఆహారాన్ని తినకుండా నిరసన వ్యక్తం చేసిన ఆటగాళ్లు, ఘటనపై స్పందించిన ఐసీసీ అధికారులు

టీ20 ప్రపంచ కప్‌లో (t20 world cup2022) భాగంగా పాకిస్తాన్‌పై (Pakistan) విజయం సాధించి.. తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ (Sydney) చేరుకున్న టీమిండియా (Team India) అక్కడి సర్వీసుల పట్ల అసంతృప్తి (Indian team unhappy) వ్యక్తం చేసింది.

Team India (Image Credits: Twitter)

టీ20 ప్రపంచ కప్‌లో (t20 world cup2022) భాగంగా పాకిస్తాన్‌పై (Pakistan) విజయం సాధించి.. తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ (Sydney) చేరుకున్న టీమిండియా (Team India) అక్కడి సర్వీసుల పట్ల అసంతృప్తి (Indian team unhappy) వ్యక్తం చేసింది. తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసి ప్రాక్టీస్‌ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాతే వారు లంచ్‌ చేసినట్లు తెలుస్తోంది.

గురువారం నెదర్లాండ్‌పై మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మంగళవారం ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ అనంతరం మధ్యాహ్న భోజనంగా చద్ది ఆహారం (చల్లబడింది), సాండ్‌విచ్‌‌లు అందించడంపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు టాప్ ఇండియన్ ఆటగాళ్లు ఆ ఆహారాన్ని (complains of cold food) తినకుండా నిరసన వ్యక్తం చేశారు. ఆహారం విషయంలోనే కాదు.. మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ చేరుకున్న భారత జట్టుకు సరైన రీతిలో స్వాగతం కూడా పలకలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వైరల్ వీడియో, హార్థిక్ పాండ్యాను కపిల్‌దేవ్‌తో పోల్చిన మాజీ క్రికెటర్‌ క్రిష్టమాచారి శ్రీకాంత్‌, కపిల్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్‌ అని సమాధానం ఇచ్చిన పాండ్యా

టీమిండియాకు అందించిన ఆహారం బాలేదు. సాండ్‌విచ్‌లు మాత్రమే ఇచ్చారు. సిడ్నీలో ప్రాక్టిస్ సెషన్ తర్వాత అందించిన ఫుడ్ చల్లగా ఉంది. అదేమీ బాలేదు. ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేశాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రాక్టిస్ తర్వాత అందించిన ఆహారంలో సాండ్‌విచ్‌లు, పండ్లు, ఫలాఫెల్ (స్ట్రీట్ ఫుడ్ లాంటిది) అందించారని, ఈ ఆహారంపై ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారని తెలిపాయి. ప్రాక్టిస్ వద్ద లంచ్ చేయకూడదని టాప్ ఆటగాళ్లు నిర్ణయించారని, తమకు నచ్చిన ఆహారం కోసం హోటల్‌కు వెళ్లిపోయారని రిపోర్టులు పేర్కొన్నాయి.

కాగా ఇది బాయ్‌కాట్ చేయడం లాంటిది కాదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్టు సమాచారం. ‘ అందరూ లంచ్ చేయాలనుకున్నారు. కానీ కొందరు ఆటగాళ్లు పండ్లు మాత్రమే తీసుకున్నారు’ అని వెల్లడించారు. అందుకోసమే ఆటగాళ్లు హోటల్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కాగా టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే ఆటగాళ్లకు ఆహారం, బస ఏర్పాట్లను ఐసీసీ నిర్వహిస్తోంది. ద్వైపాక్షిక సీరిస్‌లలో ఆతిథ్య దేశాలు భారత ఆటగాళ్లకు వేడి వేడి భారతీయ వంటకాలను సిద్ధం చేసేవని, అయితే ఐసీసీ వేడి ఆహారాన్ని అందించడంలేదని ఒక అధికారి పేర్కొన్నారు.

శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన స్టొయినిస్‌, కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ, 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించిన ఆసీస్

ఇదిలా ఉంటే టీమిండియా బస చేసే హోటల్‌కు.. గ్రౌండ్‌కు దాదాపు 42 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు సమస్య ఏమిటంటే.. లంచ్‌ తర్వాత ఐసీసీ వేడి వేడి వంటకాలు వడ్డించదు. ద్వైపాక్షిక సిరీస్‌ సమయంలో అయితే.. ఆతిథ్య దేశానికి చెందిన క్యాటరింగ్‌ ఇన్‌చార్జ్‌ ఈ వ్యవహారాలు చూసుకుంటారు. ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత భారతీయ వంటకాలు వడ్డిస్తారు. అయితే, ఐసీసీ మాత్రం అన్ని దేశాల ఆటగాళ్లకు ఒకే రకమైన భోజనం ఇస్తుంది. అవకాడోతో తయారు చేసిన చల్లారిపోయిన సాండ్‌విచ్‌ మాత్రమే కాదు.. టొమాటో, దోసకాయ వంటివి కూడా భోజనంలో ఉంటాయి’’ అని పీటీఐతో వ్యాఖ్యానించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement