పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి విదితమే. బౌలింగ్‌లో 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్న హార్ఠిక్ బ్యాటింగ్‌లో 37 బంతుల్లో 40 రన్స్ స్కోర్ చేవాడు. కోహ్లీతో కలిసి 113 రన్స్ జోడించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్‌లో పాండ్యాను మాజీ క్రికెటర్ క్రిష్టమాచారి శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేశాడు. పోలికలు చేయడం సరికాదు అని, కానీ, నువ్వు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న తీరు కపిల్‌దేవ్‌ను గుర్తు చేసేలా ఉందని శ్రీకాంత్ అన్నారు. నువ్వు చూపిస్తున్న ప్రభావం.. అప్పట్లో కపిల్ చూపేవారన్నారు. శ్రీకాంత్ అన్న మాటలకు పాండ్యా నవ్వుతూ.. కపిల్ గ్రేటెస్ట్ ప్లేయర్ అని సమాధానం ఇచ్చారు.ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)