D Gukesh Wins FIDE World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్, విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత రెండో ఆటగాడిగా రికార్డు

భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

D Gukesh (Photo Credit: X/@FIDE_chess)

భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

చివరిదైన 14వ గేమ్‌లో చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నాడు. అత్యంత చిన్న వయసులో 18 ఏళ్లకే గుకేశ్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. మొత్తం 14 గేమ్‌లలో గుకేశ్ 3, లిరెన్ 2 గేమ్‌లో విజయం సాధించారు. తొమ్మిది గేమ్‌లు డ్రా అయ్యాయి.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా భారత యువతేజం గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ సొంతం, విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో..

ఈ క్షణం కోసం తాను పదేళ్లుగా కలలు కన్నానని గుకేశ్ అన్నాడు. తన కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ విజయాన్ని తాను ఊహించలేదని, ఈ ఘనత సాధించగానే భావోద్వేగానికి లోనయ్యానన్నాడు. తన దృష్టిలో లిరెన్ నిజమైన ప్రపంచ ఛాంపియన్ అని పేర్కొన్నాడు. లిరెన్‌కు అతను ధన్యవాదాలు తెలిపాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement