Ananthapuram Shocker: ఏపీ నూతన మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపులో అపశృతి, ట్రాఫిక్ నిలిచిపోవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న 8 నెలల చిన్నారి మృతి,

అస్వస్థతకు గురైన 8 నెలల చిన్నారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. మంత్రి ఊరేగింపు కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో.. చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగింది.

Representational Image (Photo Credits: ANI)

అనంతపురం:  ఏపీలో ఇటీవల మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ చేసిన విషయం తెలిసిందే. కొత్తమంత్రివర్గంలో చోటు సంపాదించిన ఉషా శ్రీచరణ్.. ప్రమాణ స్వీకారం అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించారు. మంత్రి ఊరేగింపు నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. అదే సమయంలో అస్వస్థతకు గురైన 8 నెలల చిన్నారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. మంత్రి ఊరేగింపు కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో.. చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగింది.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేశ్ - ఈరక్క దంపతులకు 8 నెలల క్రితం పాప పుట్టింది. నిన్నసాయంత్రం చిన్నారి ఉన్నట్లుండి అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే వారు ఆటోలో చిన్నారితో కల్యాణదుర్గం బయల్దేరారు. అదే సమయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ పట్టణానికి వస్తుండడంతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో చిన్నారితో వెళ్తున్న ఆటో పట్టణ శివారులో చిక్కుకుపోయింది. ఆలస్యం అవుతుండడంతో తెలిసినవారి బైక్‌పై చిన్నారిని తీసుకుని బయలుదేరారు. 15 నిమిషాల తర్వాత ఆసుపత్రికి చేరుకున్నారు.

అమ్మ ఒడిపై ఎలాంటి ఆంక్షలు లేవు, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది, ఆధారాలు ఉంటే చూపించాలని మండిపడిన ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్

కానీ.. అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. పాప మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ట్రాఫిక్ నిలిపివేయకుండా ఉండి ఉంటే.. తమ కుమార్తె బతికేదని వాపోయారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తాము ఎవరినీ అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. చిన్నారి అస్వస్థతకు గురైందని తెలియగానే వెంటనే వారిని పంపించామని చెప్పారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement