Joint Wheel Broke In Shilparam: శిల్పారామంలో విరిగిన జాయింట్ వీల్, 20 అడుగుల ఎత్తు నుంచి కింద ప‌డ్డ ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఒక‌రు మృతి, మ‌రొక‌రికి తీవ్ర‌గాయాలు

తిరుపతిలోని(Tirupati) తిరుచానూరు శిల్పారామం( Shilparamam) లో విషాదం చోటు చేసుకుంది. ఫన్‌రైడ్‌లో భాగంగా జాయింట్‌ వీల్‌ తిరుగుతున్న సమయంలో ఒక్కసారి క్రాస్‌వీల్‌ 20 అడుగుల పైనుంచి కిందపడింది. అందులో ఉన్న లోకేశ్వరి అనే మహిళ తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి

Joint Wheel Broke In Shilparam

Tirupati, NOV 03: తిరుపతిలోని(Tirupati) తిరుచానూరు శిల్పారామం (Shilparamam) లో విషాదం చోటు చేసుకుంది. ఫన్‌రైడ్‌లో భాగంగా జాయింట్‌ వీల్‌ తిరుగుతున్న సమయంలో ఒక్కసారి క్రాస్‌వీల్‌ 20 అడుగుల పైనుంచి కిందపడింది. అందులో ఉన్న లోకేశ్వరి అనే మహిళ తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను నిర్వాహకులు తిరుపతి రుయా ఆస్పత్రికి (Ruya Hospital) తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: చికెన్ ఫ్రైలో పురుగు, స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాద్ యువకుడు, షాక్‌తో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు 

జాయింట్ వీల్ విరిగిప‌డ్డ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అంత ఎత్తు నుంచి ప‌డ‌టంతో త‌ల‌కు తీవ్రంగా గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. అజాగ్ర‌త్త‌గా జాయింట్ వీల్ నిర్వాహ‌కులు వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement