Andhra Pradesh: కాకినాడ ప్యారీ కంపెనీలో భారీ పేలుడు, ఇద్దరు మృతి, 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం, పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళన
సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. వాక్యామ్ గడ్డర్ పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను సుబ్రహ్మణ్యం, రాం ప్రసాద్‌గా గుర్తించారు.
Kakinada, August 29: ఏపీలోని కాకినాడ జిల్లాలో గత వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. వాక్యామ్ గడ్డర్ పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను సుబ్రహ్మణ్యం, రాం ప్రసాద్‌గా గుర్తించారు. కాగా, వారి మృతితో పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. పుల్లుగా మందేసి పోలీస్ స్టేషన్‌లోనే మహిళతో పనికానిచ్చిన ఏఎస్ఐ, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు, కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఘటన
ఇక, ప్యారీ కంపెనీలో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం చోటుచేసుకోవడం కార్మికులను భయాందోళనకు గురిచేసంది. ఇదే పరిశ్రమలో ఆగస్టు 12వ తేదీన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. కాగా, రిఫైనరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్వేయర్ బెల్ట్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.