Hyderabad, Jan 18: సంక్రాంతి (Sankranti) సంబురాల్లో కోడి పందేల (Cock Fighting) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ, పందెంలో చనిపోయిన కోడికి వేలంలో లక్ష రూపాయల ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏలూరుకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ కలిసి పందెం కోసం కోడిపుంజును పెంచారు. గురువారం జరిగిన కోడిపందెంలో అది తుదికంటా పోరాడి ఓడిపోయింది. దీంతో వారు ఈ పుంజును కాల్చి వేలానికి పెట్టారు. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ. 1,11,111కు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (వీడియో)
ఎందుకు కొన్నారంటే?
ఓడిపోయినప్పటికీ ఆ కోడి పోరాట పటిమను చూసిన ఔత్సాహికులు పలువురు దానిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు. చివరికి ఓ వ్యక్తి దానిని లక్ష రూపాయలకు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.