Tirumala, Jan 18: కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవాలని పరితపించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జనవరి 18 (శనివారం)న అంటే ఈ రోజు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను జనవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు, రెండు విడతలుగా సెషన్స్, ఆశగా ఎదురుచూస్తున్న ఆ రాష్ట్రాలు
స్పెషల్ దర్శన టికెట్లు
ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
అంగ ప్రదక్షిణం టోకెన్లు
అంగ ప్రదక్షిణం టోకెన్లను జనవరి 23న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.
శ్రీవాణి ట్రస్టు టికెట్లు
శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో విడుదల చేసే టికెట్లను జనవరి 23న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం దర్శన టోకెన్లను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
ఖేల్ రత్న అవార్డు అందుకున్న మనూభాకర్, గుకేశ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం, వీడియో ఇదిగో
శ్రీవారి సేవలు
శ్రీవారి సాధారణ సేవ కోటాను జనవరి 27న ఉదయం 11 గంటలకు, శ్రీవారి నవనీత సేవ కోటాను జనవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు, శ్రీవారి పరాకామణి సేవ కోటా జనవరి 27న మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేస్తారు.
తిరుమల, తిరుపతి గదుల కోటా
తిరుమల మరియు తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
బుకింగ్ కోసం సూచనలు
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, మరియు గదుల కోటాలను బుక్ చేసుకోవడానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని టీటీడీ సూచించింది.