Andhra Pradesh cabinet takes key decisions(X)

Vij, Jan 17:  ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం పీఎం కిసాన్ వేసిన వెంటనే ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించింది కేబినెట్.

పోలవరం డయాఫ్రంవాల్ వెంటనే ప్రారంభించాలని, రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయని తెలిపారు సీఎం చంద్రబాబు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఫ్రీ హోల్డ్ లాండ్స్‌పై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇన్‌చార్జి మంత్రులను జిల్లాల వారీగా మీటింగ్ పెట్టి, సమీక్ష చేసి, వచ్చే కేబినెట్ సమావేశానికి నివేదికలు తీసుకురావాలని నిర్ణయించారు. GSD వృద్ధి సాధించేందుకు కొన్ని రంగాలను లక్ష్యం చేసుకోవాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్‌, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చ 

ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే TIDCO ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంచార్జి మంత్రులు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి స్థలాలు సేకరణపై నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు నిధులు ఇవ్వడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపింది కేబినెట్. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు ఇచ్చినా భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్ కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని భావించింది కేబినెట్. శనివారం సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షా వస్తున్నారని, ఆయనతో డిన్నర్ మీట్‌లో మూడు పార్టీల నేతలు కలుస్తారని సీఎం చెప్పారు.