AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 585 కోవిడ్ కేసులు నమోదు, నెలలో కోటి మందికి టీకా పంపిణీ జరిగేలా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్19 మళ్లీ విజృంభిస్తుంది, రోజూవారీ కేసుల సంఖ్య ఐదు వందలు దాటింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఏపిలో కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ప్లాన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.....

Vaccine | Image used for representational purpose (Photo Credits: Oxford Twitter)

Amaravati, March 24: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్19 మళ్లీ విజృంభిస్తుంది, రోజూవారీ కేసుల సంఖ్య ఐదు వందలు దాటింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఏపిలో కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ప్లాన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్నారు. సోమవారం నుంచి అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాబోయే నాలుగైదు వారాల్లో కోటి మంది లక్ష్యంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి ఉంటే పూర్థి స్థాయిలో వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టేవాళ్లం, అయితే అలా జరగకుండా కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏదిఏమైనా ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలని సీఎం జగన్ అన్నారు.

ఇప్పటివరకు ఏపిలో 18 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక నివేదికలో పేర్కొంది.

ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,066 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 585 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,95,121 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,92,226గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు  జిల్లా నుంచి అత్యధికంగా 128 కోవిడ్ కేసులు నమోదు కాగా, గుంటూరు నుంచి 99, విశాఖపట్నం నుంచి 81, మరియు కృష్ణా నుంచి 63 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,197కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 251 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,84,978 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2946 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement