English Medium in Public Schools: ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం

ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం (English Medium in AP) అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి.

English Medium in Public Schools: ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం
Jagananna Vasathi Deevena and Jagananna Vidya Deevena Scheme 2020 in AP (Photo-Twitter)

Amaravati, May 14: ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం (English Medium in AP) అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఏపీ విద్యాశాఖా మంత్రి

కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) గట్టిగా పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం మే 13, బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. మైనారిటీ భాషా మాధ్యమ స్కూళ్లలో విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఆంగ్ల మాధ్యమ తరగతుల్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఇక 7, 8, 9, 10 తరగతులు కూడా ఏటా క్రమేణా ఆంగ్ల మాధ్యమాలుగా మారతాయి. ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి, పేరంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు

గతంలో ఇంగ్లీషు మీడియం అమలుపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారి పిల్లలు ఏ మీడియం కావాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కావాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు కోరుకున్న నేపథ్యంలో ఈ మీడియంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలిని (ఎస్సీఈఆర్టీ) ప్రభుత్వం కోరింది.మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 53,943 మంది తెలుగు మాధ్యమంలో బోధన కోరుకున్నారు. కాగా ఎస్సీఈఆర్టీ తన నివేదికను మే 11, సోమవారం నాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఒకటి నుంచి ఆరు వరకే ఇంగ్లీష్ మీడియం, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి, ప్రతి ఏడాది నుంచి ఒక్కో సంవత్సరం పెంపు, పదోతరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

విద్యార్థులు తమ తమ మాతృభాషలో ప్రావీణ్యత పొందేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే ఇతర సబ్జెక్టుల్లో నైపుణ్యం సాదించేందుకు 1 వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ సిఫార్సు చేసింది. ఎస్సీఈర్టీ సిఫార్సులను ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తూ ఇంగ్లీషు మీడియం అమలుపై తాజాగా జీవో జారీ చేసింది. అయితే ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనాపరంగా, ఆర్థికపరంగా సాధ్యం కాదు కనుక గతంలో ఇచ్చిన జీఓ 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో (672 మండలాల్లో) ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. దూరంగా ఉన్నవారికి రవాణా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఈ జీవోలో పలు సిఫార్సులు చేసింది. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలని, అభ్యసనం వివిధ ప్రక్రియల ద్వారా కొనసాగాలని తెలిపింది. విద్యార్థులు ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా తడబాటుకు తావులేకుండా చెప్పగలగాలి. ప్రభుత్వం 1నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేస్తున్నాం. విద్యార్థులు, తలిదండ్రులు ఇంగ్లీషు మాధ్యమాన్ని కోరుకుంటున్నందున ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని 1నుంచి 6 వ తరగతి వరకు ప్రవేశపెట్టవచ్చని జీవోలో తెలిపారు.

ఎస్సీఈఆర్టీ 1–6 ఆంగ్ల మాధ్యమం పుస్తకాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేసి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసింది. ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు. తెలుగు సబ్జెక్టును 1 నుంచి 10 తరగతి వరకు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు పాఠ్యపుస్తకాలను పటిష్టంగా తీర్చిదిద్దింది.

ఇదిలా ఉంటే ఏపీ లో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. స్కూళ్లు కాలేజీల అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధించింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు ఇష్టం వచ్చినంత మంది విద్యార్థులను, ఇష్టం వచ్చినన్ని సెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. కొత్త నిబంధనల ప్రకారం ఒక్కో సెక్షన్‌లో అత్యధికంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి 9 సెక్షన్ల వరకు అనుమతి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

(The above story first appeared on LatestLY on May 14, 2020 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).