AP Budget 2021-22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశం, రూ. 2,29,779 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన, వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి

తొలిసారి లింగ ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్న మంత్రి బుగ్గన, ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళలకు మరియు చిన్నారులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీరి కోసం బడ్జెట్‌లో రూ. 47,283 కోట్లు కేటాయించినట్లు తెలిపారు....

AP Budget Session 2021-22 | Photo: CMO

Amaravathi, May 20:  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం గురువారం ప్రారంభమైంది. ఏపి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు. ఇందులో రెవెన్యూ రూ. 1 లక్ష 82 వేల 196 కోట్లు ఉండగా, మూలధన వ్యయం - రూ. 47,582 కోట్లు, రెవెన్యూ లోటు - రూ. 5 వేల కోట్లు, ద్రవ్యలోటు రూ. 37,029.79 కోట్లు కాగా, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం మరియు రెవెన్యూ లోటు 0.47 శాతంగా పేర్కొన్నారు.

తొలిసారి లింగ ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్న మంత్రి బుగ్గన, ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళలకు మరియు చిన్నారులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీరి కోసం బడ్జెట్‌లో రూ. 47,283 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

2021-22 ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్‌ కేటాయింపులు ఇలా ఉన్నాయి:

 

►బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు

►ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు

►ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు

►మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌: రూ.1,756 కోట్లు

►చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు

►మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు

►వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు

►విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు

►వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు

►వైఎస్‌ఆర్‌ బీమాకు రూ.372.12 కోట్లు

►అర్చకుల ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు

►ఇమామ్‌, మౌజాంల ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు

►పాస్టర్ల ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు

►వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా: రూ.1802 కోట్లు

►డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు

►పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247

►వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు

►వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61 కోట్లు

►దిశ కోసం రూ.33.75 కోట్లు

►అంగన్వాడీల్లో నాడ-నేడు కార్యక్రమాలకు రూ.278 కోట్లు

►వైఎస్సార్‌ పింఛన్‌ కానుక: రూ.17 వేల కోట్లు

►వైఎస్సార్‌ రైతు భరోసా: రూ.3,845 కోట్లు

►జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు

►జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు

►వైఎస్సార్‌ నేతన్న నేస్తం: రూ.190 కోట్లు

►వైఎస్సార్‌ మత్స్యకార భరోసా: రూ.120 కోట్లు

►మత్స్యకారులకు డీజిల్‌ రాయితీ: రూ.50 కోట్లు

►అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు: రూ.200 కోట్లు

►రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు

►వైఎస్సార్‌ కాపు నేస్తం: రూ.500 కోట్లు

►వైఎస్సార్‌ జగనన్న చేదోడు: రూ.300 కోట్లు

►వైఎస్సార్‌ వాహన మిత్ర: రూ.285 కోట్లు

►వైఎస్సార్‌ ఆసరా: రూ.6,337 కోట్లు

►అమ్మఒడి: రూ.6,107 కోట్లు

►వైఎస్సార్‌ చేయూత: రూ.4,455 కోట్లు

►రైతు పథకాలు: రూ.11,210.80 కోట్లు

►రైతులకు నష్ట పరిహారం: రూ.20 కోట్లు

►లా నేస్తం: రూ.16.64 కోట్లు

►ఈబీసీ నేస్తం: రూ.500 కోట్లు

►విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు

►స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు

►జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు

►జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు

►ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు

►వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు

►వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు

►వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

►వైఎస్‌ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు

►ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు

►ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు

►ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు

►కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు

►ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు

►శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు

►హౌసింగ్‌, మౌలిక వసతులకు రూ.5,661 కోట్లు

►పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు

►ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు

►కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ.250 కోట్లు

►ఏపీఐఐసీకి రూ.200 కోట్లు కేటాయింపు

►ఎంఎస్‌ఎంఈలో మౌలిక వసతులకు రూ.60.93 కోట్లు

►పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు

►రోడ్లు భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు

►ఎనర్జీ రంగానికి రూ.6,637 కోట్లు

►ల్యాండ్‌ రీసర్వే కోసం రూ.206.97 కోట్లు

►పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖకు రూ.8,727 కోట్లు

►నీటిపారుదల శాఖకు రూ.13,237.78 కోట్లు.

కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గురువారం ఒక్కరోజే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ ఒక్కరోజులోనే బడ్జెట్‌పై చర్చ జరిపై మరియు ఆమోదం తెలుపుతారు. ఇక జగన్ సర్కార్ 'అప్రజాస్వామిక పాలన'ను నిరసిస్తూ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని  బహిష్కరిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now