AP Inter Exams 2024: ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లు సిద్ధం, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు

ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు తెలిపారు.

Representational Image (File Photo)

ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు తెలిపారు. శుక్రవారం మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కాగా, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు.

మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 60 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమేరాలతో నిఘా ఉంచారు.

ఇంటర్ పరీక్షలు, విద్యార్థి ప్రాణం తీసిన ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన, డ్యాంలో దూకి సూసైడ్ చేసుకున్న విద్యార్థి

పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి, పరిశీలకుల హాజరును ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్‌ బోర్డు ‘డిజిటల్‌ నిఘా’ను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్‌’ కోడ్‌ను జోడించారు.పేపర్‌ ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు.

ఇంటర్ పరీక్షలకు తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని వెనక్కి పంపిన అధికారులు, కంటతడి పెట్టుకున్న అమ్మాయి, వీడియో ఇదిగో..

దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే సెంటర్లను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్టు ఇంటర్‌ విద్య కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. కాగా, పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్‌ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్‌ల స్వీకరణకు 08645–277707, టోల్‌ఫ్రీ నంబర్‌ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్‌ చేయొచ్చు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement