Perni Nani vs Pawan: మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో, నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావా అంటూ పవన్‌పై ఫైర్ అయిన పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్‌ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani vs Pawan) మండిపడ్డారు.

Perni-Nani (Photo-Twitter)

Hyd, Oct 17: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్‌ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani vs Pawan) మండిపడ్డారు.షూటింగ్‌ గ్యాప్‌లో పవన్‌ విశాఖకు వెళ్లారు. విశాఖ నుంచి కదలనని ఎందుకు వెళ్లిపోయారు. పవన్‌కు చంద్రబాబు ప్రయోజనాలే కావాలి. విలువలు, నిబద్ధత లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని పేర్ని నాని దుయ్యబట్టారు.

‘‘మీ కార్యక్రమాన్ని మేం ఆపలేదు, టీవీల నిండా, పేపర్ల నిండా వార్తలు కావాలి. మళ్లి రేపటి నుండి షూటింగ్‌లకు వెళ్లిపోవాలి. పవన్‌కు 3 రోజులు షూటింగ్‌లో ఖాళీ దొరికింది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఒకే మాట మీద నిలబడడు. చంద్రబాబుకు ఒక శాపం ఉంది. ఆయన నోట నిజం వస్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అలాగే పవన్ కల్యాణ్‌కు మాట మీద నిలబడితే అదే శాపం ఇతనికి ఉందేమో’’ అంటూ పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

2024లో గన్నవరం నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా, సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారని విమర్శలు

‘‘మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటున్నావు. నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావ్. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో. భరణం ఇస్తున్నావ్.. కాకపోతే నీతి సూక్తులు చెప్పేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదని పవన్‌ను ఉద్దేశించి పేర్ని నాని (Perni Nani) హితవు పలికారు. ఇప్పటికైనా నిబద్దతతో, నీతితో కూడిన రాజకీయాలు చేస్తే శత్రువులు కూడా హర్షిస్తారు. మీ కార్యకర్తలే సిగ్గుపడే విధంగా ఎప్పుడు ఎవరి మాట భుజాన్న వేసుకుంటాడో, ఎవరిని నెత్తిన పెట్టుకుంటాడో తెలియని పరిస్థితి. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత లేని వ్యక్తిగా పవన్‌కు గుర్తింపు వచ్చింది’’ అని పేర్ని నాని అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement