Bus Driver Dies of Heart Attack: స్కూలు బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి, 40 మంది విద్యార్థులను కాపాడి మృత్యు ఒడిలోకి..

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. ప్రాణం పోయే ముందు బ్రేక్ వేసి బస్సును రోడ్డు పక్కన ఆపాడు. గుండెపోటుతో డ్రైవర్ చనిపోయాడు..

Bus Driver Dies of Heart Attack (Photo-X)

Bapatla, Sep 20: ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. ప్రాణం పోయే ముందు బ్రేక్ వేసి బస్సును రోడ్డు పక్కన ఆపాడు. గుండెపోటుతో డ్రైవర్ చనిపోయాడు.. అయితే, బస్సులోని పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి లోని ఓ ప్రైవేటు స్కూలులో చుట్టుపక్కల ఊళ్ల నుంచి విద్యార్థులు చదువుకుంటున్నారు. వారి కోసం స్కూల్ యాజమాన్యం ఓ బస్సును నడుపుతోంది. ఆ బస్సుకు ఏడుకొండలు (55) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగానే బుధవారం ఉదయం కూడా వెంపరాల రూట్‌ లోని గ్రామాలలో 40 మంది విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు తీసుకొస్తున్నాడు. వెంపరాల సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ ఏడుకొండలు బస్సును రోడ్డుపైనే బస్సును ఆపేశాడు.

వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్, సహచరులు వేగంగా స్పందించి సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు

గుండెల్లో నొప్పిగా ఉందంటూ నీళ్లు తాగి ఆపై స్టీరింగ్ పైనే తలవాల్చాడు. బ్రేక్ వేసి బస్సును నిలపడంతో పిల్లలకు ముప్పు తప్పింది. బస్సు రోడ్డుపైనే ఆగడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూడగా.. ఏడుకొండలు స్టీరింగ్ పై తలవాల్చి కనిపించాడు. వెంటనే ఏడుకొండలును కిందికి దించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు తెలిపారు. కాగా, విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ తో స్కూలుకు చేర్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement