AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,855 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 6,54,385కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 5,558కు పెరిగిన కరోనా మరణాలు

ఉభయ గోదావరి జిల్లాల్లో నుంచే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1095 కేసులు నమోదయ్యాయి....

Coronavirus Outbreak (Photo Credits: IANS)

Amaravati, September 24: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు గతంలో కంటే తగ్గినప్పటికీ, తీవ్రత మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గలేదు. ప్రతిరోజు నమోదయ్యే కేసులు వేలల్లోనే ఉంటున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 7,855 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 6,54,385కు చేరింది.

అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 6,51,490మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఎప్పట్లాగే ఉభయ గోదావరి జిల్లాల్లో నుంచే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1095 కేసులు నమోదయ్యాయి.

ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 998 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. మరోవైపు ప్రకాశం నుంచి 927 కేసులు, చిత్తూరు జిల్లా నుంచి 902 కేసులు నివేదించబడ్డాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 52 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,558 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో  8,807 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 5,79,474 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 69,353 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  76,000 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు రాష్ట్రంలో  53,78,367 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement