COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,895 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,53,111కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3282కు పెరిగిన కరోనా మరణాలు

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,449 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,60,087 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 89,742 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ...

COVID in india | (Photo-PTI)

Amaravati, August 23: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 7,895 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,53,111 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,50,216 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1256 కేసులు నమోదయ్యాయి.  నెల్లూరు, ప్రకాశం మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా సుమారు వెయ్యికి దగ్గరగా పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Report:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 93 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 2,282 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,449 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,60,087 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 89,742 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  46,712 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు సుమారుగా  32,38,038 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement