Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ స్థాయిలో 3,963 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 52 మంది మృతి, రాష్ట్రంలో 44 వేలు దాటిన కొవిడ్19 బాధితుల సంఖ్య

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 52 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. పలు జిల్లాల నుంచి పదుల సంఖ్యలో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 586 కు పెరిగింది.

Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, July18: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 3,963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి.  తాజా రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 44,609 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 41,714 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 23,872 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 52 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది.  పలు జిల్లాల నుంచి పదుల సంఖ్యలో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 586 కు పెరిగింది.

 

AP COVID19 Report: 

status of positive cases of #COVID19 in Andhra Pradesh

 

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,411 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 21,763 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,22,60 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement